సఖినేటిపల్లి: అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. 4వ తేదీ రథసప్తమి. సూర్య, చంద్రప్రభ వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం. అదే రోజు స్వామివారిని పెండ్లికుమారుడిని, అమ్మవారిని పెండ్లికుమార్తెను చేయడం (ముద్రికాలంకరణ). 5వ తేదీ గరుడ పుష్పక, పుష్పక వాహనాలపై.. 6న హంస, శేష వాహనాలపై గ్రామోత్సవాలు. సాయంత్రం ధ్వజారోహణ. 7వ తేదీ పంచముఖాంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై గ్రామోత్సవాలు, రాత్రి 12.55 గంటలకు స్వామివారి తిరు కల్యాణం. 8వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం. 9న గజ, పొన్న వాహనాలపై గ్రామోత్సవాలు, రాత్రి అన్నపర్వత మహానివేదన. 10న హనుమద్, సింహ వాహనాలపై గ్రామోత్సవాలు. సాయంత్రం సదస్యం. 11న రాజాధిరాజా, అశ్వ వాహనాలపై గ్రామోత్సవాలు. 16 స్తంభాల మండపం వద్ద చోరసంవాద ఘట్టం. 12న చక్రవారీ స్నానం.. 13 రాత్రి తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవం.
Comments
Please login to add a commentAdd a comment