కాకినాడ క్రైం: ఏళ్లకు ఏళ్లు కాంట్రాక్టు విధానంలో కొనసాగుతూ చాలీచాలని జీతాలు, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వర్తిస్తున్న తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ తరఫున నాయకులు కాకినాడ అర్బన్, రూరల్ ఎంఎల్‌ఏలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలను కలసి శనివారం వినతిపత్రం సమర్పించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మామిడి చిన్నారి మాట్లాడుతూ నూరు శాతం గ్రాస్ శాలరీ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులకు అమలయ్యేలా చూడాలన్నారు. పీహెచ్‌సీల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించి రాత్రి సమయంలో భద్రతను పటిష్టం చేయాలన్నారు. రూ.50 లక్షల బీమా, మెడికల్ లీవ్‌లు అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ నర్సుల బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎంఎల్‌ఏలను కలసిన వారిలో నర్సులు సత్యసుధ, సుధ, సుమ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment