డ్రగ్స్‌కు అలవాటు పడితే కేసులు
● చదువుకోవడానికే కళాశాలకు రావాలి
● సామర్లకోట కళాశాల విద్యార్థులకు కలెక్టర్ హెచ్చరిక
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్లు ఆరోపణలు రావడం సిగ్గుచేటని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు తెలిస్తే వారిపై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. విద్యార్థులు చదువుకోవడానికి మాత్రమే కళాశాలకు రావాలని చెప్పారు. ఇక నుంచి ప్రతి నెలా ఇంటర్ విద్యార్థుల పరిస్థితిపై సమీక్షిస్తామని, ఏ విద్యార్థిపై ఫిర్యాదు వచ్చినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల ఇంటర్ విద్యార్థుల క్వార్టర్లీ పరీక్ష పేపర్లు పరిశీలించామని, అనేక మంది వెనుకబడి ఉన్నారని అన్నారు. ఉతీర్ణత శాతం పెంచడానికి ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లీలా శ్రీదేవి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ తుమ్మల బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ, వైస్ చైర్మన్ గోకిన సునేత్రాదేవి, ఎంఈఓలు వై.శివరామకృష్ణయ్య, పి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment