కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో ఓ జూనియర్ అసిస్టెంట్ (గుమస్తా) వీరంగం సృష్టించడం కలకలం రేపింది. వివరాలివీ.. జీజీహెచ్ జనరల్ సెక్షన్–1లో మెడికల్ రీ యింబర్స్‌మెంట్ సీటు గుమస్తాగా డీఎస్‌ఎల్‌ఎన్ మూర్తి అలియాస్ సాయి పదేళ్లుగా కొనసాగుతున్నాడు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతడి సీటును మారుస్తూ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి సుమారు రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఎంత మాత్రం అంగీకరించేది లేదని డిప్యూటీ కలెక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ వద్దకు వెళ్లి అప్పట్లోనే సాయి గొడవ పడ్డాడు. దీనిపై ఆయన సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఆ సీటు వదిలేది లేదని సాయి రెండు నెలలుగా భీష్మించుకు కూర్చున్నాడు. పాలనా పరమైన మార్పుల్లో భాగంగా సాయితో కలిపి మరో నలుగురికి సూపరింటెండెంట్ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేశారు. సాయి తప్ప మిగిలిన నలుగురూ బదిలీ అయిన సీట్లకు వెళ్లారు. సాయి రెండోసారి కూడా సీటు మార్చడానికి ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల్లో జరగనున్న ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశానికి సంబంధించి తన చాంబర్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి.. అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, ఏడీ అనురాధ, ఏఓ శఽర్మ సహా మరికొందరితో గురువారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సాయి ఒక్క ఉదుటన తలుపు నెట్టుకొని సూపరింటెండెంట్ చాంబర్‌లోకి ప్రవేశించాడు. తన సీటు మార్పు ఉత్తర్వులను అధికారులందరి ముందు సూపరింటెండెంట్ ముఖాన విసిరి కొట్టాడు. దుర్భాషలాడుతూ ‘నా సీటు మార్చారో.. మీ అందు చూస్తా’నంటూ డిప్యూటీ కలెక్టర్, సూపరింటెండెంట్‌లను హెచ్చరించాడు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్‌కు డాక్టర్ లావణ్య కుమారి ఫిర్యాదు చేశారు. పలువురు ఉద్యోగ సంఘ నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. సాయి ప్రవర్తనను తప్పుబట్టారు. అయితే, ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శ్రీధర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు జీజీహెచ్‌కు వచ్చి సాయిని విచారించారు. సాయి పదేళ్లుగా ఇదే సీటులో కొనసాగుతున్నాడని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ సీటు పరిధిలో మెడికల్ రీయింబార్స్‌మెంట్, సదరం సర్టిఫికెట్లు, మెడికల్ ఇన్వాలిడేషన్ సహా కీలక కార్యకలాపాలన్నీ జరుగుతాయన్నారు. వీటిలో భారీ అవినీతి, లంచాల నేపథ్యంలో ఫిర్యాదులు అందడంతో పాటు పాలనాపరమైన మార్పుల్లో భాగంగా సీటు మార్పునకు సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఆ ఆదేశాలను మిగిలిన వారు పాటించినా.. సాయి అభ్యంతరకరంగా వ్యవహరించాడని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏపీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహన్ ఆధ్వర్యాన పలువురు నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, సాయికి స్టేషన్ బెయిల్ ఇప్పించారు.
జీజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్
వీరంగం
సూపరింటెండెంట్,
డిప్యూటీ కలెక్టర్లకు బెదిరింపు
సూపరింటెండెంట్ ముఖం పైకి
పత్రాలు విసిరికొట్టిన వైనం
కలెక్టర్ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment