రూ.1,500 ఇప్పుడైనా ఇస్తారా?
ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరంలోనైనా అమలు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తాననే హామీని కొత్త సంవత్సరంలోనైనా అమలు చేయాలి.
– మచ్చ బిందు, గృహిణి, వీకే రాయపురం,
సామర్లకోట మండలం
ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. దీనిని కొత్త సంవత్సరంలోనైనా నెరవేర్చాలి. మహిళలకు ఇచ్చిన హామీలను 2024లో అమలు చేయలేదు. మహిళలకు రూ.1,500, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలను అమలు చేస్తే బాగుంటుంది.
– వేల్పూరి రత్నకుమారి, తాళ్లూరు, గండేపల్లి
గంజాయి, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం
యువత కొత్త సంవత్సరం వేడుకల్లో సంప్రదాయాన్ని జోడించాలి. పాశ్చాత్య పోకడలకు స్వస్తి పలకాలి. అందరినీ సోదర భావంతో చూడాలి. ఏడాది ప్రారంభంలో చేసే తీర్మానాలు ఏడాది పొడవునా సక్రమంగా అమలు చేసేలా చూసుకోవాలి. గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా కొత్త సంవత్సరంలో పని చేస్తాం.
– విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ, కాకినాడ
సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కొత్త సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. సామాన్యుల నుంచి మధ్య తరగతి, పేదలు ప్రగతి బాటలో పయనించేందుకు జిల్లా యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలి. ఏడాది పొడవునా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి.
– షణ్మోహన్ సగిలి, జిల్లా కలెక్టర్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment