జగ్గంపేట: జాతీయ రోలర్ స్కేటింగ్‌లో ఇద్దరు విద్యార్థులకు బంగారు, రజత పతకాలు లభించాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల నిర్వహించిన 62వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో జగ్గంపేటకు చెందిన సీరపు హరిప్రియరెడ్డి, ఆమె సోదరుడు జస్వంత్‌రెడ్డి పాల్గొన్నారు. హరిప్రియరెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి, బంగారు పతకం, జస్వంత్‌రెడ్డి రజత పతకం సాధించారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో వీరిద్దరినీ స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందించారు. కార్యక్రమంలో సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ఎస్సై రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.
31జెపిటి01:
పతకాలు సాధించిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment