నూతన ఉషస్సు కోసం.. | - | Sakshi
Sakshi News home page

నూతన ఉషస్సు కోసం..

Published Wed, Jan 1 2025 12:18 AM | Last Updated on Wed, Jan 1 2025 12:18 AM

నూతన

నూతన ఉషస్సు కోసం..

కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం

అంబరాన్నంటిన సంబరాలు

కొంగొత్త ఆలోచనలతో ముందుకు సాగాలంటూ పరస్పర శుభాకాంక్షలు

సంక్షేమ వసంతం విరబూయాలని ఆశలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా వ్యాప్తంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఇంట మరింత ఆనందం నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలు శుభాకాంక్షలు, పూజలు, ప్రార్థనలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. గతించిన 2024 సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరచేందుకు ప్రయత్నిస్తూ.. కొత్త సంవత్సరంలో తాము అనుకున్నవన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. కోటి ఆశలతో 2025 సంవత్సరానికి కోలాహలంగా స్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తారతమ్యాలు లేకుండా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పెద్ద ఎత్తున సందడి చేశారు. డీజేలు, బార్లలో నృత్యాలు, రోడ్లపై ర్యాలీలు, భారీ బాణసంచా కాల్పుల నడుమ నూతన సంవత్సర వేడుకలను హోరెత్తించారు. పలు రోడ్ల కూడళ్లలో యువత భారీ కేకులు కట్‌ చేశారు. విద్యుద్దీపాలంకరణలతో వీధులను రంగుల మయం చేశారు. శ్రీబైబై 2024.. వెల్‌కం 2025శ్రీ అంటూ పెద్ద పెట్టున నినదించారు. అపార్ట్‌మెంట్లలో అందరూ కలిపి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు మంగళవారం పెద్ద ఎత్తున బొకేలు, స్వీట్లు కొనుగోలు చేశారు. దీంతో ఆయా షాపులు రద్దీగా మారాయి. పలువురు ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్ల వద్ద రద్దీ నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించి, వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎన్నో ఆశలతో..

2019–24 మధ్య నాటి ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజకంగా అందించిన సంక్షేమ పాలన గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో మటుమాయమైంది. గడచిన ఏడు నెలల కూటమి పాలనలో మచ్చుకు కూడా సంక్షేమం కనిపించకపోవడం ప్రజలను నిరాశపరిచింది. ఒక్క పింఛన్‌ పెంపు తప్ప మరే ఇతర పథకం అమలుకు నోచలేదు. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అరకొరగానే అమలవుతోందనే విమర్శ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ కొత్త సంవత్సరంలోనైనా అమలుకు నోచాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

ఫ నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేద విద్యార్థుల చదువులకు కొండంత అండగా నిలిచిన పథకం శ్రీఅమ్మ ఒడిశ్రీ. దీని ద్వారా జగన్‌ పాలనలో ఏటా లక్షా 86 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,140 కోట్లు జమ చేసేవారు. ఈ పరిస్థితుల్లో ఈ పథకం పేరును శ్రీతల్లికి వందనంశ్రీగా మార్చిన కూటమి.. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందే తప్ప.. గద్దెనెక్కాక అమలు చేయలేదు. ఈ ఏడాదైనా ఈ మాట నిలబెట్టుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు.

ఫ ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కొత్త సంవత్సరంలోనైనా సాకారం చేయాలని మహిళలు కోరుతున్నారు. తద్వారా జిల్లాలో ఆర్టీసీ బస్సులలో రోజూ ప్రయాణించే 40 వేల మంది మహిళలకు ప్రయోజనం కల్పించాలని ఆశిస్తున్నారు. ఈ హామీని కూటమి సర్కార్‌ అమలు చేయకపోవడంతో నెలకు రూ.7.50 కోట్ల చొప్పున ఏడు నెలల్లో రూ.52 కోట్ల మేర కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికీ ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఈ పథకం పేరును శ్రీఅన్నదాత సుఖీభవశ్రీగా మార్చి.. రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీనిని అమలు చేయకపోవడంతో జిల్లాలోని 1,74,229 మంది రైతులు రూ.20 వేల చొప్పున ఇప్పటికే రూ.348.46 కోట్లు నష్టపోయారు. కొత్త సంవత్సరంలోనైనా ఈ హామీ నెరవేర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఫ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు అండ్‌ కో ప్రకటించారు. ఈవిధంగా జిల్లాలో అర్హులైన 7,37,471 మంది మహిళలకు ఆరు నెలల్లో రూ.663.72 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. నూతన సంవత్సరంలోనైనా ఈ మాట నిలబెట్టుకోవాలని, తమకు బకాయిలతో సహా చెల్లించాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ 18 నుంచి 35 ఏళ్ల లోపు నిరుద్యోగులకు ఉద్యోగం లేదా ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీని ప్రకారం జిల్లాలో అర్హులైన యువత 3.15 లక్షలు పైనే ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వీరికి గడచిన ఆరు నెలల్లో రూ.567 కోట్ల మేర నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. దీనికి 2014లో మాదిరిగా ఎగనామం పెట్టకుండా కొత్త సంవత్సరంలో భృతి చెల్లించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

ఫ జిల్లావ్యాప్తంగా 91 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో 6.34 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్న కూటమి నేతల హామీ అరకొరగానే అమలవుతోంది. కనీసం కొత్త సంవత్సరంలోనైనా దీనిని పారదర్శకంగా అమలు చేయాలని, ఆరు నెలల పాలనలో పెండింగ్‌లో ఉన్న 9.51 లక్షల ఉచిత సిలిండర్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.

పెట్టుబడి సాయం ఇవ్వాలి

వైఎస్సార్‌ సీపీ హయాంలో రైతులకు ఏటా ఠంచన్‌గా రూ.13,500 పెట్టుబడి సాయా న్ని రైతు భరోసా కింద అందించేవారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలకరి పంటకు సాయం అందిస్తారని ఆశగా ఎదురు చూశాం. నిరాశే మిగిలింది. ఇప్పుడు రబీ సీజన్‌ ప్రారంభమైంది ఇప్పటికై నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రైతులకిచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.

– రెడ్డి వీరభద్రరావు, రైతు, కరప

తల్లికి వందనం వేయాలి

ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నా ఇద్దరు కుమార్తెలను చదివించేందుకు ముందుకు వచ్చాను. పెద్ద కుమార్తె పైడాలో పాలిటెక్నిక్‌ చదువుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో ఇంటి వద్దనే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండో అమ్మాయి ఇంటర్‌ చదువుతోంది. తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.20 వేలు ప్రభుత్వం ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలూ అమలు చేసి, పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకుంది. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.

– కడియాల రాజు, వాకలపూడి, కాకినాడ రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
నూతన ఉషస్సు కోసం..1
1/3

నూతన ఉషస్సు కోసం..

నూతన ఉషస్సు కోసం..2
2/3

నూతన ఉషస్సు కోసం..

నూతన ఉషస్సు కోసం..3
3/3

నూతన ఉషస్సు కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement