ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు
వలంటీర్లకు గత ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కనీసం విధుల్లోకి తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనీసం గతంలో ఇచ్చిన రూ. 5 వేలు గౌరవ వేతనం అయినా చెల్లిస్తే మా కుటుంబాలకు అసరాగా ఉంటుంది. రాజకీయాల కోసం మమ్మల్ని పక్కన బెట్టడం ఎంత వరకు సమంజసం?.
సతీష్, వలంటీర్, తాళ్లరేవు
సేవలకు దూరంగా ఉంచుతున్నారు
గతంలో వలంటీర్లుగా మేము ప్రతి నెలా ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఇచ్చే పింఛన్‌లను అందించే వాళ్లం. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలను అందేలా చూసేవారం. అలాంటి మమ్మల్ని విధులకు దూరం పెడుతుంటే బాధగా ఉంటుంది. తక్షణం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి.
ఏ ప్రకాష్, వలంటీర్, గొల్లప్రోలు
70 శాతం మంది మహిళలే
కాకినాడ జిల్లాలో పని చేసే వార్డు, గ్రామ వలంటీర్లలో 70 శాతం మంది వరకు మహిళలమే ఉన్నాం. ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం మా కుటుంబాలకు వేడి నీళ్లకు చన్నీళ్ల సాయంలా అక్కరకు వచ్చేది. ఏడు నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా వేతనాన్ని మంజూరు చేసి ఆదుకోవాలి.
కె దుర్గ, కొవ్వాడ, కాకినాడ రూరల్
కక్ష సాధింపు తగదు
వలంటీర్లపై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు. గ్రామ వార్డు వలంటీర్లకు తక్షణం వేతన బకాయిలు చెల్లించాలి. గత ఏడు నెలలుగా వలంటీర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వలంటీర్లపై సానుకూలంగా స్పందించాలి.
చెక్కల రాజ్‌కుమార్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment