జాతీయ కర్లింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జమ్ముకాశ్మీర్‌లో ఈ నెల 17 నుంచి 21 వరకూ జరగిన 4వ సబ్ జూనియర్స్ నేషనల్ కర్లింగ్ క్రీడా పోటీలలో లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ విషయాన్ని పాఠశాల డైరెక్టర్ ఎన్.సుగుణా రెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. తమ విద్యార్థులైన నల్లమిల్లి శేషు రిషిత్ రెడ్డి (8వ తరగతి) అండర్– 14 బాలుర విభాగం లో బంగారు పతకం, జట్టు విభాగం లో కాంస్య పతకం, భీమన నాగేంద్రనాథ్ ఠాగూర్ (6వ తరగతి) అండర్ –14 బాలుర జట్టు విభాగంలో బంగారు పతకం, భీమన శ్రీదేదీప్య (5వ తరగతి) అండర్ – 14 జట్టు విభాగంలో వెండి, మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాలు సాధించారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై శ్రద్ధ చూపాలన్నారు. ఆదిత్య సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల లాభాలు చాలా ఉన్నాయని, క్రీడాకారులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని, ఐకమత్యం, సంఘీభావం, చొరవ, నేర్పు, పట్టుదల, దీక్ష, నాయకత్వ లక్షణాలు మొదలైన సుగుణాలు అలవడతాయన్నారు. లక్ష్య పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ వందన బోహ్రా మాట్లాడుతూ 19 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కర్లింగ్ పోటీలలో పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ తరఫు లక్ష్య ఇంటర్నేషనల్ విద్యార్థులు పాల్గొని, చాంపియన్స్‌గా నిలిచారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment