లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి
సామర్లకోట: లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ అన్నారు. స్థానిక లారీ ఓనర్స్ అసోషియేషన్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాజ్జీ బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 26 లారీ ఓనర్ల అసోసియేషన్లు ఉన్నాయన్నారు. ఆయా లారీ ఓనర్స్ అసోసియేషన్ పరిధిలోని ఫ్యాక్టరీలు సొంత లారీలను లోడింగ్‌లకు ఉపయోగించడం వల్ల యూనియన్‌లో ఉన్న లారీ యజమానులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలకు వెళ్లి లారీ ఓనర్స్ అసోసియేషన్లకు సహకరించాలని కోరతామన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, సీఎంలకు తమ సమస్యలపై వినతి పత్రాలను అందజేస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి నాయుడు మాట్లాడుతూ లారీ ఓనర్స్ సమస్యలను రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకు వెళ్లతామన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బినీడి దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు రౌతు అర్జుబాబు, సహా య కార్యదర్శులు వి.సూర్యనారాయణ, కె.పెదకావు, కోశాధికారి ఎంఎస్‌ఎన్ రాజు, పట్టణ యూనియన్ కార్యదర్శి పెదిరెడ్ల కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment