6 నుంచి కుంతీమాధవుని కల్యాణోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

6 నుంచి కుంతీమాధవుని కల్యాణోత్సవాలు

Published Sun, Feb 2 2025 12:15 AM | Last Updated on Sun, Feb 2 2025 12:15 AM

6 నుంచి కుంతీమాధవుని కల్యాణోత్సవాలు

6 నుంచి కుంతీమాధవుని కల్యాణోత్సవాలు

పిఠాపురం: దేశంలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతీ మాధవస్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించనున్నామని దేవస్థానం ఈఓ నున్న శ్రీరాములు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రతి రోజూ పంచామృతాభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించనున్నామన్నారు. ఉత్సవాలు జరగనున్నాయిలా..

6వ తేదీ: ధ్వజారోహణం, పిఠాపురం మహారాజా రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్‌ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలకు శ్రీకారం. ఈ రోజు నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శ్రీచక్రపెరుమాళ్ల గ్రామోత్సవం.

7వ తేదీ: ఉదయం 9 గంటలకు అలంకార తిరుమంజనం, కల్యాణాలంకారం.

8వ తేదీ: స్వామివారి ధ్రువమూర్తులకు పంచామృతాభిషేకం, సహస్రనామార్చన. సాయంత్రం 4 గంటలకు గజవాహనంపై గ్రామోత్సవం, రాత్రి 9 గంటలకు స్వామివారి దివ్య కల్యాణోత్సవం.

9వ తేదీ: ఉదయం 9 గంటలకు శేష, సాయంత్రం 4 గంటలకు గరుడ వాహనాలపై గ్రామోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

10వ తేదీ: రాత్రి 7 గంటలకు పొన్న వాహనంపై గ్రామోత్సవం.

11వ తేదీ: రాత్రి 10 గంటలకు రథోత్సవం.

12వ తేదీ: ఉదయం 7 గంటలకు ఉప్పాడ వద్ద సముద్ర తీరంలో స్వామివారి చక్రస్నానం.

13వ తేదీ: ఉదయం 7 గంటలకు పంచామృతాభిషేకం. సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి కుంకుమ పూజ. రాత్రి 9 గంటలకు శ్రీపుష్ప యాగం, కల్యాణోత్సవాల ముగింపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement