సామర్లకోట: మండలంలోని వేట్లపాలెంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకూ ఆలయంలో జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పెండ్యాల నాగేశ్వరరావు మాస్టారు ఈ విషయం తెలిపారు. పురుషులకు, సీ్త్రలకు విడివిడిగా ఈ పోటీలు ఉంటాయన్నారు. ప్రతి బృందంలో 10 మంది సభ్యులుండాలని, అందరూ ఒకే గ్రామానికి చెందిన వారై ఉండాలని తెలిపారు. సభ్యులందరూ ఒకే రకమైన యూనిఫాంతో భజనలో పాల్గొనాలన్నారు. మహిళల బృందంలో పురుషులు పాడరాదన్నారు. హార్మోనియం, డోలక్ వాయించడానికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. కీర్తనలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రతి బృందం సభ్యులు విధిగా గోవింద నామాలు పాడాలన్నారు. ఒక్కో బృందానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు 94412 94845, 85209 94222 సెల్ ఫోన్‌కు సంప్రదించి తమ బృందాల పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. సీ్త్ర, పురుషులకు విడివిడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామని నాగేశ్వరరావు మాస్టారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment