![చెడు వ్యసనాలకు బానిసై చోరీలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05amp251-270002_mr-1738780889-0.jpg.webp?itok=LNvctuMs)
చెడు వ్యసనాలకు బానిసై చోరీలు
అమలాపురం రూరల్: చెడు వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని వారు దొంగిలించిన 13 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోనసీమతో పాటు ఇతర జిల్లాల్లో మొటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వారి వివరాలను డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం గంజాయి, మద్యం తదితర వ్యసనాలతో డబ్బుకోసం వారు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. కోనసీమలోని వివిధ పోలీస్ స్టేషన్‌తో పాటు విశాఖ జిల్లా పరిధిలోని కంచర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వారు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వారి నుంచి రూ.8.82 లక్షల విలువైన 13 మోటార్ సైకిళ్లను, మూడు బ్యాటరీలను రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలిపారు.
నిందితులైన కాట్రేనికోన మండలం చెయ్యేరు గున్నేపల్లికి చెందిన మేకల వీర వెంకట శ్రీరామ్ మూర్తి, అమలాపురం మండలం ఈదరపల్లి చెందిన వీరమల్లు తరుణ్ శశికుమార్, ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన దొంగ లోకేష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు. రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో తాలూకా ఎస్సై వై.శేఖర్‌బాబు. క్రైమ్ ఏఎస్సై సుబ్బారావు, హెచ్‌సీ రవికుమార్, పీసీలు శివకుమార్, ధర్మరాజు నిందితులను పట్టుకోవడంలో శ్రమించారన్నారు. వారికి రివార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ముగ్గురు మైనర్లతో పాటు ఆరుగురి అరెస్టు
13 మోటార్ సైకిళ్ల స్వాధీనం
అమలాపురం డీఎస్పీ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment