గంజాయి, జూదంపై ఉక్కుపాదం
పెద్దాపురం: గంజాయి, జూదాల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ ఆవరణలో పరిశుభ్రతను, వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, జిల్లా మీదుగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు దాడులు, తనిఖీలు చేస్తామని చెప్పారు. పండగ వాతావరణం పేరుతో మొదలైన కోడిపందాలు, పేకాట శిబిరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి రోజూ దాడులు నిర్వహిస్తామని తెలిపారు. జూదాల నిర్వహణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్ భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ కృష్ణభగవాన్, ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రోన్లపై కానిస్టేబుళ్లకు శిక్షణ
కాకినాడ క్రైం: డ్రోన్ల వినియోగంపై హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక శిక్షణ బుధవారం ముగిసింది. జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. త్వరలో ప్రతి స్టేషన్ పరిధిలో ఓ డ్రోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్ వినియోగించి, కీలక కేసులు ఛేదిస్తే సిబ్బందిని తగిన రీతిలో సత్కరిస్తామని తెలిపారు.
పంచాయతీరాజ్ గెజిటెడ్
అధికారుల నూతన కార్యవర్గం
కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్‌వీ ప్రసాదరావు, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అందరూ డీఎల్డీవోలు, ఎంపీడీవోలు పాల్గొని, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులుగా జెడ్పీ డిప్యూటీ సీఈవో జీఎస్ రామ్‌గోపాల్, జిల్లా అధ్యక్షులుగా పెద్దాపురం ఎంపీడీవో డి.శ్రీలలిత, ఉపాధ్యక్షులుగా తుని ఎంపీడీవో కె.సాయినవీన్, డ్వామా ఏపీడీ పి.జగదాంబ, ప్రధాన కార్యదర్శిగా కాజులూరు ఎంపీడీవో జె.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా బి.హరికృష్ణ, కార్యదర్శులుగా ప్రత్తిపాడు ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్‌బాబు, సామర్లకోట ఎంపీడీవో కె.హిమమహేశ్వరి, మహిళా కార్యదర్శిగా కరప ఎంపీడీవో కె.స్వప్న, కోశాధికారిగా డ్వామా డీఎల్డీవో పి.భాస్కర్ ఎన్నికయ్యారు.
డ్రోన్ పనితీరును పరిశీలిస్తున్న
ఎస్పీ బిందుమాధవ్
Comments
Please login to add a commentAdd a comment