![సూర్యనారాయణుని కల్యాణానికి సర్వం సిద్ధం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rcp81a-270063_mr-1738866840-0.jpg.webp?itok=ucChaQ1Y)
సూర్యనారాయణుని కల్యాణానికి సర్వం సిద్ధం
భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
పెదపూడి: వైష్ణవ సంప్రదాయంలో పూజాదికాలు చేసే ఏకై క సూర్యదేవాలయం ఉన్న మండలంలోని జి.మామిడాడ స్వామివారి కల్యాణానికి సమాయత్తమైంది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళా శాసనాలతో ఏకాదశి శనివారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. బాణసంచా పోటీల్లో గెలుపొందిన వారికి కాసు బంగారం బహుమతి ఇవ్వనున్నారు. రథసప్తమితో ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్స వాలు ఈ నెల 13వ తేదీతో ముగియనున్నాయి. శనివారం వారి కల్యాణం సందర్భంగా ఉదయం 5 గంటలకు నిత్యోపాసన, విశేషహోమం, బలిహరణ, 8 గంటలకు ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్‌లో భారీ అన్న సమారాధన, 12.30 గంటకు శ్రీవారి రథోత్సవం, రాత్రి 7 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment