![అయినవిల్లి విఘ్నేశ్వరునికి రూ.1,08,774 ఆదాయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06amp102-270016_mr-1738866840-0.jpg.webp?itok=Zwgv-xOy)
అయినవిల్లి విఘ్నేశ్వరునికి రూ.1,08,774 ఆదాయం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి గురువారం ఒక్క రోజు వివిధ పూజ టిక్కెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.1,08,774 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారి ఆలయ ప్రదానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు ఒక జంట, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 18 మంది, శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో ఆరు జంటలు, స్వామివారికి గరిక పూజల్లో 36 మంది భక్తులు పాల్గొన్నారు. ముగ్గురు చిన్నారులకు అన్నప్రసాన, తులాభారం నిర్వహించారు. 14 వాహన పూజలు జరిపారు. స్వామివారి అన్న ప్రసాదాన్ని 1060 మంది స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment