ఆదర్శంగా నిలుస్తున్న యువమిత్రులు | - | Sakshi
Sakshi News home page

ఆదర్శంగా నిలుస్తున్న యువమిత్రులు

Published Sat, Oct 5 2024 1:36 AM | Last Updated on Sat, Oct 5 2024 1:36 AM

ఆదర్శ

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఎవరో వస్తారని...ఏదో చేస్తారని చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడి తమకు వచ్చిన సొంత ఆలోచనతో ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. నేటి తరంలో ఎందరో యువకులు బతుకుదెరువు నిమిత్తం విదేశాలకు వెళ్తు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ఇద్దరు యువ మిత్రులు.

బాల్యం నుంచి ఇద్దరు కలిసి ఒకే పాఠశాలలో చదువుకుంటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కూడా ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబ పెద్దలు అయిన ఇద్దరి తండ్రులు వివిధ కారణలతో మరణించారు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ భారం మోయాల్సి రావడంతో ఇద్దరు పాల వ్యాపారం చేద్దామని నిర్ణయానికి వచ్చారు. అనుకొన్న తరుణంలోనే మొదటగా రెండు గేదెలను కొనుగోలు చేసి, వాటిని మేపుతూ.. ఉదయం సాయంత్రం వేళ ల్లో పాలు పితుకుతూ..ఉపాధి పొందుతున్నారు.. సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన నిమ్మలబోయిన అశోక్‌, కొడగంటి నిఖిల్‌లు. వీరు నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 11 గేదెలు కొనుగోలు చేసి ప్రతి రోజు వాటిని మేపుతూ, ఉదయం సాయంత్రం వేళల్లో పాలను పితుకుతున్నారు. ప్రతి రోజు 40 లీటర్ల వరకు పాలను హోటల్‌లో విక్రయిస్తు ఆదాయం పొందుతున్నారు. పాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చులు పోను ఇద్దరు పంచుకుని జీవనాన్ని సాగిస్తున్నారు.

ఆలనాపాలనా చూస్తూ..

అశోక్‌కు వ్యవసాయ బావి వద్ద ఉన్న స్థలంలో ఒక ప్రత్యేక షెడ్డును ఇద్దరు కలిసి నిర్మించారు. ఆ షెడ్డులో గేదెలు పెంచి పోషిస్తున్నారు. షెడ్డు నిర్మా ణం కోసం వేలల్లో ఖర్చు చేసే స్తోమత తమ వద్ద లేకపోవడంతో ఇద్దరు కలిసి షెడ్డును నిర్మించుకున్నారు. రాత్రింబవళ్లు పశువుల ఆలనాపాలనా చూస్తు ఉపాధి పొందుతున్నారు. వచ్చిన కొంత లా భమైన దానితోనే సంతృప్తి పొందుదామని వారు నిర్ణయానికి వచ్చారు.

ఉన్న ఊరిలోనే ఉపాధి

వెతుక్కున్న యువకులు

గేదెలను కొనుగోలు చేసి వ్యాపారం

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం

సొంత పనే ఆనందాన్నిస్తుంది

సొంతంగా చేసుకునే పనే ఆనందాన్నిస్తుంది. ఒకరి వద్ద పని చేస్తే వారికి బానిసలాగా ఉండాల్సి వస్తది. సొంత కాళ్ల మీద నిలబడి పని చేసుకోవడమే బెటర్‌. ఉన్న ఊరిలోనే సంపాదన బాగుంటుంది. విదేశాలకు వెళ్లి అప్పుల పాలు కావల్సిన దానికంటే పాడి ద్వారా మంచి ఉపాధి పొందుతున్నాం. మూగజీవాలకు సేవ చేయడం మంచి సంతృప్తినిస్తుంది. వాటి ద్వారా ఆదాయం లభిస్తోంది.

– నిమ్మల బోయిన అశోక్‌, సదాశివనగర్‌

ప్రభుత్వం సహకరించాలి..

మా లాంటి యువకులకు ఉపాధి చూపిస్తు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే బాగుంటది. ప్రభుత్వం ప్రోత్సా హం అందించాలి. చిన్న తనంలో మా తండ్రి మరణించడంతో కుటుంబ భారం మోయాల్సి వచ్చింది. ఏదో ఒక ఉపాధి పొందాలనే ఉద్దేశ్యంతో పాల వ్యాపారంను ఎంచుకున్నా. ప్రతి రోజు పాలను హోటల్‌లో విక్ర యిస్తూ ఆదాయం పొందడం ఆనందంగా ఉంది.

– కొడగంటి నిఖిల్‌, సదాశివనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదర్శంగా నిలుస్తున్న యువమిత్రులు 1
1/2

ఆదర్శంగా నిలుస్తున్న యువమిత్రులు

ఆదర్శంగా నిలుస్తున్న యువమిత్రులు 2
2/2

ఆదర్శంగా నిలుస్తున్న యువమిత్రులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement