రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలి
కామారెడ్డి క్రైం : జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం శనివారం కలెక్టరేట్‌లో జరిగింది. విజేతలకు మెడల్స్, ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 7, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10 నుంచి 12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయి, 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయిలలో పోటీలు నిర్వహించామన్నారు. 8 వేల మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. వివిధ క్రీడాంశాలలో వెయ్యి మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ హరిలాల్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజేత జట్లు..
ఖోఖో బాలుర విభాగంలో మద్నూర్, ఎల్లారెడ్డి జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. భిక్కనూరు మండలం మూడో స్థానం దక్కించుకుంది. బాలికల విభాగంలో రామారెడ్డి, పాల్వంచ, బిచ్కుంద మండలాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.
కబడ్డీ బాలుర విభాగంలో పిట్లం మొదటి స్థానంలో, తాడ్వాయి, రామారెడ్డి మండలాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో బీబీపేట్ మొదటి, పాల్వంచ ద్వితీయ, భిక్కనూరు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.
వాలీబాల్ బాలుర విభాగంలో తాడ్వాయి మొదటి, నాగిరెడ్డిపేట్ ద్వితీయ, బీర్కూర్ తృతీయ స్థానాలు సాధించాయి. బాలికల విబాగంలో నస్రుల్లాబాద్ మొదటి, ఎల్లారెడ్డి అర్బన్ ద్వితీయ, తాడ్వాయి జట్టు తృతీయ స్థానాన్ని పొందాయి.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment