విభిన్నంగా పాఠాలు చెప్పే విద్యారమణ
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఎనిశెట్టి విద్యారమణ బోధనలో విభిన్న పద్ధతులు అవలంబిస్తారు. విద్యార్థులు మ్యాథ్స్‌పై పట్టు సాధించేలా ప్రయత్నిస్తుంటారు. మొన్నటి వరకు సదాశివనగర్ మోడల్ స్కూల్‌లో పనిచేసి ఇటీవలే ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌కు బదిలీపై వచ్చారు. విద్యార్థులకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు.. గణితంపై సులువుగా పట్టు వస్తుందని ఆమె పేర్కొంటారు. ఫార్ములాను ఎలా వాడాలో తెలిసేలా చేస్తూ విద్యార్థులు గణితంలో రాణించేలా చూస్తున్నారు. స్కూల్ స్థాయిలో ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు మ్యాథ్స్ అంటే భయం పోయి ఇష్టంగా చదవగలుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment