సాధన చేయిస్తూ తీర్చిదిద్దుతున్న ప్రవీణ్
బీబీపేట మండలం జనగామ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ చాలా కాలం పాటు ఇదే మండలంలోని మాందాపూర్ ఉన్నత పాఠశాలలో పనిచేశారు. ఇటీవలే జనగామకు బదిలీపై వచ్చారు. మాందాపూర్‌లో పనిచేసిన కాలంలో.. ఆ పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంలో ప్రవీణ్‌కుమార్ పాత్ర ఎంతో ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటారు. పిల్లలకు బోర్ రాకుండా, వారికి అర్థమయ్యే రీతిలో త్రీ ఆర్ పద్ధతులను అవలంబిస్తూ పాఠాలు బోధిస్తారు. విద్యార్థులు ప్రవీణ్ సార్ క్లాస్ కోసం ఎదురుచూస్తుంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎక్కువ సాధన చేయించడం ద్వారా విద్యార్థులను గణితంలో తీర్చిదిద్దుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment