కొనసాగుతున్న విచారణ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విచారణ

Published Sun, Dec 22 2024 2:16 AM | Last Updated on Sun, Dec 22 2024 2:16 AM

కొనసా

కొనసాగుతున్న విచారణ

పెద్దకొడప్‌గల్‌: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఉడికీఉడకని అన్నం తిని తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత, ఫుడ్‌ సేఫ్టీ అధికారి సునీత శనివారం రెండోరోజూ హాస్టల్‌ను సందర్శించి, విచారణ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరథ్‌, ఇన్‌చార్జి ఏఎస్‌డబ్ల్యూ వెంకటేశ్‌, మండల వైద్యాధికారి ఉమాకాంత్‌ పాల్గొన్నారు.

జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పరీక్ష ఫలితాలు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి కోర్టులో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం కోసం శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ స్కూల్‌లో పరీక్ష నిర్వహించారు. స్టెనో టైపిస్ట్‌ పరీక్షకు 14 మంది, టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 42, రికార్డు అసిస్టెంట్‌ పరీక్షకు 78 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను https://kamareddy.dcourts.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్‌ తెలిపారు. ఎంపికై నవారు ఈనెల 28వ తేదీన నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మౌళిక ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఓ ప్రకటనలో సూచించారు.

‘ధ్యానంతో ఒత్తిడి దూరం’

కామారెడ్డి అర్బన్‌ : యోగా, ధ్యానంతో ఒత్తిడి లేని సంతోషకరమైన జీవితం గడపవచ్చని డీఆర్డీవో సురేందర్‌ పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా యోగా అండ్‌ స్పోర్ట్స్‌ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ కోటేశ్వర్లు, జిల్లా యోగా అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, యోగాచార్యులు గరిపల్లి అంజయ్య గుప్తా, అంతిరెడ్డి, పి.అంజయ్య, ప్రతినిధులు అనిల్‌రెడ్డి, రమేష్‌, గంగప్రసాద్‌, హిమబిందు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరం

కామారెడ్డి క్రైం: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో మెగా రక్తదా న శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ప్రారంభించారు. వ్య వసాయ శాఖ ఉద్యోగులు రక్తదానం చేశా రు. శిబిరంలో 60 యూనిట్ల రక్తం సేకరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఆరు నెలలకోసారి రక్తదానం చేయాలని సూ చించారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ రాజ న్న, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

రేపు జాబ్‌ మేళా

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని పీజేఆర్‌ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో సోమవారం తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్‌ గురువేందర్‌రెడ్డి తెలిపారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీలో 300లకుపైగా ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఈ జాబ్‌మేళాకు డిగ్రీలో ఏ గ్రూప్‌లోనైనా ఉత్తీర్ణులైన వారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌, డైరెక్టర్‌ గోపాల్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌, ప్రోగ్రాం అధికారి మహేష్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొనసాగుతున్న విచారణ 
1
1/3

కొనసాగుతున్న విచారణ

కొనసాగుతున్న విచారణ 
2
2/3

కొనసాగుతున్న విచారణ

కొనసాగుతున్న విచారణ 
3
3/3

కొనసాగుతున్న విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement