కుక్కల దాడిలో లేగదూడ మృతి
మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలో కుక్కల దాడిలో లేగదూడ మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామంలోని కిరణ్‌కు చెందిన లేగదూడను శనివారం రాత్రి పాకలో వదిలేశారు. రాత్రిపూట కుక్కలు లేగదూడను వెంబడించి తీవ్రంగా గాయపరిచాయి. ఉదయం కిరణ్ పాక దగ్గరకు వెళ్లి చూడగా దూడను కుక్కలు చుట్టుముట్టాయి. దాడిలో లేగదూడ అక్కడికక్కడే మృతిచెందింది. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించాలని కోరుతున్నారు.
మల్కాపూర్‌లో
కొండచిలువ కలకలం
బీబీపేట: మండలంలోని మల్కాపూర్ గ్రామంలోగల ఓ పొలంలోని బావి వద్ద కొండ చిలువ ఆదివారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన గోవిందరాజు ఎప్పటిలాగే వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లగా కొండచిలువ కంటపడింది. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల రైతులకు సమాచారం అందించగా వారు వచ్చి కొండచిలువను చంపేశారు. కొండచిలువ సుమారు రెండు మీటర్ల పొడవుతో 5 కిలోల బరువు ఉందని రైతు తెలిపారు. గతంలో సైతం ఇదే శివారులోని పలువురి పొలాల్లో కూడా కొండ చిలువలు కనిపించడంతో స్థానికులు చంపేశారు. ప్రతిసారి ఇలా ప్రత్యక్షం అవడంతో రైతులు అందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment