నాగలి పట్టని రైతుబిడ్డ! | - | Sakshi
Sakshi News home page

నాగలి పట్టని రైతుబిడ్డ!

Published Mon, Dec 23 2024 1:26 AM | Last Updated on Mon, Dec 23 2024 1:26 AM

నాగలి

నాగలి పట్టని రైతుబిడ్డ!

సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

– 9లో u

వ్యవసాయం దినదిన గండంగా మారుతోంది. విత్తనాల నుంచి కోతల వరకు.. ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులు రైతుకు దడ పుట్టిస్తున్నాయి. పెరిగిన పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు కాని ధరలు, మార్కెట్‌లో దళారుల దందా, స్థిరమైన ఆదాయం లేకపోవడం, ప్రభుత్వాల విధానాలు వెరసి కర్షక కుటుంబాలు సాగుకు దూరమవుతున్నాయి. దీంతో రైతు కుటుంబాలకు చెందిన భవిష్యత్తు తరాలు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో వ్యవసాయ భూములు ఉన్న వారు 2 లక్షలపైచిలుకు మంది ఉన్నారు. ఇందులో రైతు బీమాకు 1.93 లక్షల మంది అర్హులున్నారు. రికార్డుల్లో రైతుల సంఖ్య ఎక్కువే ఉన్నా వారిలో చాలా మంది సేద్యాన్ని వదిలేసి ఇతర పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో లక్షన్నరలోపు మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని సమాచారం. మిగతా వారు ఇతర వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 2.13 లక్షల మంది రైతు కూలీలున్నారు. వీరిలో చాలామంది వ్యవసాయ పనులకు బదులు ఇతర వృత్తుల్లోకి మళ్లారు. చాలా మంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. ఈ ఏడాది వలసలు మరింత పెరిగాయి.

సాగునీటి సమస్య...

జిల్లాలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నా దానికింద కొద్ది శాతం మాత్రమే జిల్లాకు ప్రయోజనం కలుగుతోంది. జిల్లాలో నిజాంసాగర్‌ నీరు 30 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. పోచారం ప్రాజెక్టు కింద పది వేల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. జిల్లాలో లక్షా 10 వేలకు పైగా బోర్లు, బావులున్నాయి. భారీ వర్షాలు కురిసి భూగర్భ జలమట్టం పెరిగితే తప్ప బోర్లు అనుకున్న స్థాయిలో ఎత్తిపోయడం లేదు. దీంతో బోర్లపై ఆధారపడి చేసిన వ్యవసాయం ఎప్పుడు ఎండుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీనికితోడు బోర్లు ఎత్తిపోయినపుడల్లా రైతులు కొత్తగా బోర్లు తవ్వించడానికి రూ.లక్షలు అప్పులు చేసి నష్టపోతున్నారు. కొందరు రైతులైతే ఐదారు బోర్లు తవ్వించిన వారున్నారు. చెరువులు, కుంటలు ఉన్నా వాటి కింద ఆయకట్టుకు అవసరమైన మేర నీటిని అందించలేని పరిస్థితి ఉంది. చెరువుల కింద కూడా బోర్లే దిక్కవుతున్నాయి.

రైతును దెబ్బతీసిన యాంత్రీకరణ

ఎద్దు ఎవుసం ఉన్నపుడు రైతులు సొంతంగా దుక్కుల నుంచి బురద పొలం దాకా అన్నీ తామే దున్నుకునేవారు. అవసరమైతే ఇరుగు పొరుగు రైతులను బదలు పిలుచుకుని ఒకరికొకరు సహకరించుకునేవారు. నాట్లు, కలుపు తీయడం, కోతలు.. అన్ని ఇంటి వాళ్లే చేసుకునేది. ఎప్పుడైతే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయో రైతులకు పనిభారం తగ్గి, ఆర్థిక భారం పెరిగింది. దున్నకాలకు ట్రాక్టర్లు, నాట్లు వేయడానికి కూలీలు లేదంటే మిషన్లు, వరికోతలతో పాటు ఇతర పంటల కోతలకూ హార్వెస్టర్లు అందుబాటులోకి వచ్చాయి. యంత్రాల వాడకంతో పంట సాగుకు అయ్యే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయి.

మిగులుడు ముచ్చట లేదు

లాగోడికి అప్పు జెయ్యాలె. పంట రాంగనే లెక్కలు వే సుకుంటే ఆడికాడికి అయితుంది. ఒక్కోసారి నష్టం గూడ వస్తుంది. ఏం లాభం లేదు. వానాకాలంల నేను పన్నెండు ఎకరాలు నాటేసిన. లాభం ఏమోగానీ రె క్కల కష్టం కూడా వృథా అయ్యింది. ఎనకట ఎవల పని వాళ్లు జేసుకుని ఏ రంది లేకుండా ఉంటిమి. మిషన్లు వచ్చి ఏది సక్కగ లేకుండపోయింది. ఇప్ప టి పోరగండ్లయితే ఎవుసం పని అంటే అంత దూ రం ఉరుకుతున్నరు. లాభం లేనిది ఎందుకు చేయాలంటున్నరు. –ఏముల కాశీరాం, రైతు, శేర్‌ఖాన్‌పల్లి

అప్పటి ఎవుసమే మంచిగుండేది

ఎద్దు ఎవుసం ఉన్నపుడు ఏ రంది లేకుండె. లాగోడికీ పె ద్దగా ఖర్సయ్యేది కాదు. అ న్ని పనులు మేమే చేసుకునేటోళ్లం. ఒకళ్లకు ఒకలు సా యం చేసుకునేటోళ్లం. దు న్నడం నుంచి వరి కోయడం దాకా ట్రాక్టర్లు, మిష న్లు వచ్చినయి. ఖర్చులు పెరిగినా దిగుబడి పెద్దగా పెరగలేదు. దీంతో ఎంత కష్టం చేసినా ఏమీ మిగులుతలేదు. ఏటా అప్పులు మాత్రం పెరుగుతున్నయి. వేరే ఏ పని చేయలేక ఎవుసం పట్టుకుని ఏడుస్తున్నం. – కురుమ గంగారాం, రైతు, ఎల్లారెడ్డి

న్యూస్‌రీల్‌

అడ్డగోలుగా పెరిగిన పెట్టుబడులు

దిగుబడులు అంతంత మాత్రమే..

వెంటాడుతున్న నష్టాలు

వ్యవసాయానికి దూరమవుతున్న కుటుంబాలు

నేడు జాతీయ రైతు దినోత్సవం

స్థిరమైన ఆదాయం లేక..

రైతులకు వ్యవసాయంలో స్థిరమైన ఆదాయం లభించడం లేదు. సరైన పంటలు పండక కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదు. ఏటికేడు పెట్టుబడి వ్యయం పెరుగుతున్న మేరకు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదు. దీంతో రైతు కుటుంబాలు అప్పుల్లో మగ్గిపోతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా రుణాలు మాఫీ చేస్తామంటూ పాలకులు ఊరించడం పరిపాటిగా మారింది. మాఫీ ప్రయోజనాలు అందరికీ దక్కకపోవడంతో వారు అప్పుల్లోనే ఉంటున్నారు. పంటల సాగుతోపాటు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్యానికి అయ్యే ఖర్చులు, పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకునే విషయంలో ప్రతి రైతు కనీసం రూ.పది లక్షలైనా అప్పు చేస్తున్నారు. అప్పుల భారం తగ్గకపోవడంతో చాలా మంది భూములు అమ్ముకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఆత్మహత్యల్లో చాలా చావులకు కారణం అప్పులేననేది స్పష్టంగా కనిపిస్తోంది. ఏడెనిమిదేళ్లలో జిల్లాలో 8 వేల మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నాగలి పట్టని రైతుబిడ్డ!1
1/5

నాగలి పట్టని రైతుబిడ్డ!

నాగలి పట్టని రైతుబిడ్డ!2
2/5

నాగలి పట్టని రైతుబిడ్డ!

నాగలి పట్టని రైతుబిడ్డ!3
3/5

నాగలి పట్టని రైతుబిడ్డ!

నాగలి పట్టని రైతుబిడ్డ!4
4/5

నాగలి పట్టని రైతుబిడ్డ!

నాగలి పట్టని రైతుబిడ్డ!5
5/5

నాగలి పట్టని రైతుబిడ్డ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement