సీఎం గారూ.. పరువు నిలపరూ..
రేవంత్‌రెడ్డితో గోడు చెప్పుకుంటున్న
అంకోల్ గ్రామ రైతులు (ఫైల్)
నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండలంలో గల మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న రైతులు తమ పొలాల అభివృద్ధి కోసం, బోరుబావులు తవ్వించడం కోసం భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే కాలం కలిసి రాకపోవడం, బోర్లు పడకపోవడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో పలువురు రైతులు అప్పు చెల్లించలేకపోయారు. దీంతో ఏడెనిమిదేళ్ల క్రితం వారు తీసుకున్న అప్పు.. మూడు నాలుగింతలైంది. ఇటీవల బ్యాంకు అధికారులు రుణాల వసూళ్లపై దృష్టి సారించారు. అప్పులు పేరుకుపోయిన రైతులకు నోటీసులు ఇస్తున్నారు. గడువులోగా రుణం చెల్లించలేకపోతే భూములను వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. భూములను వేలం వేస్తే పరువు పోతుందన్న భయంతో కొంతమంది రైతులు బయట అప్పులు చేసి మరీ సొసైటీ లోన్ చెల్లిస్తున్నారు.
వేలానికి ఏర్పాట్లు..
అంకోల్ తండాకు చెందిన అనూష బాయి భూమి అభివృద్ధి కోసం 2013–14 లో నస్రుల్లాబాద్ సొసైటీలో రూ. 3.70 లక్షలు రుణం తీసుకున్నారు. అది ప్రస్తుతం రూ. 10.29 లక్షలు అయ్యింది. దీంతో భూమిని వేలం వేయడానికి సహకార బ్యాంకు అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాట్లు చేశారు. సదరు రైతు రూ. 2 లక్షలు చెల్లించి గడువు కోరడంతో వేలాన్ని పక్షం రోజులు వాయిదా వేశారు. మండలంలో ఒక్క అనూషబాయి భూమినే కాదు.. త్వరలో మరికొందరి భూములనూ వేలం వేయడానికి సహకార బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 26న సంగం గ్రామానికి చెందిన రేఖ అనే రైతు భూమిని వేలం వేయనున్నట్లు కరపత్రాలు పంచుతున్నారు. వచ్చే నెలలో మరో 8 మంది రైతుల భూములను వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సహకార సంఘాలలో రుణాలు తీసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. ‘‘శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద బస చేశారు. అనంతరం అక్కడి నుంచి, బాన్సువాడ వరకు పాదయాత్ర చేశారు. మార్గమధ్యలో అంకోల్ క్యాంపు వద్ద అంకోల్ గ్రామానికి చెందిన మహిళా రైతు బ్యాంకు లోన్‌కు సంబంధించి తన గోడు చెప్పుకుంటే.. భరోసా ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలి’’ అని రైతులు కోరుతున్నారు.
సొసైటీల్లో రుణాలు తీసుకున్న రైతులు
అప్పు చెల్లించలేకపోవడంతో
వేలానికి సిద్ధమైన బ్యాంకు
నాడు తలుపులు తీసుకువెళ్తుంటేనే
తప్పుపట్టిన రేవంత్‌రెడ్డి
నేడు వేలం వేస్తున్నా స్పందించకపోవడంపై బాధిత రైతుల ఆవేదన
ఆనాడు బకాయిల వసూలు కోసం రైతు ఇంటి తలుపులు తీయడాన్ని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి. కానీ ఆయన హయాంలో ఏకంగా రైతుల భూములను వేలం వేయడానికి సహకార బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అప్పట్లో తమ తరఫున మాట్లాడి భరోసా ఇచ్చిన సీఎం.. ఇప్పుడు ఆదుకుని తమ పరువు నిలపాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment