దొంగ లెక్కలు చెప్పొద్దు
నిజామాబాద్‌నాగారం: ‘‘గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీరు నంబర్లను చూపి గొప్పలు చెప్పుకోకండి. నా వద్ద పూర్తి సమాచారం ఉంది. ప్రతిరోజూ 60 శాతం మంది వైద్యులు గైర్హాజరవుతున్నారు. వైద్యులు సమయపాలన పా టించాలి. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే చర్యలు తప్పవు. వంద రోజుల్లో మళ్లీ వస్తా.. మార్పు రాకుంటే కఠిన చర్యలు తప్పవు’’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో వైద్యారోగ్యశాఖ, జీజీహెచ్ అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పవర్ ప్రెజెంటేషన్ ద్వారా తాము అందించిన సేవలను వివరించారు. సరైన సౌకర్యాలు లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి కల్పించుకుని.. మీరు చెప్పే నంబర్లను నమ్మబోనని, గాంధీ, వరంగల్ ఆస్పత్రులకన్నా ఎక్కువ వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పడం మానుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. రోజూ 40శాతం మంది వైద్యులు మాత్రమే విధులకు హాజరవుతున్నారన్నారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ప్రతిమారాజ్‌కు సూచించారు. అనంతరం సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రులలో 85 శాతం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రు ల్లో తనిఖీలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలో ఫీజుల నియంత్రణ, సదుపాయాల కల్పనపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
రూ.7కోట్లు మంజూరు చేస్తా
జీజీహెచ్‌లో పైపులైన్‌ల లీకేజీ, భవనంపై పిచ్చిమొక్కలు, కిటికీలకు అద్దాలు పగిలిపోవడం, లిఫ్ట్‌లు చెడిపోవడం, ఎలుకలు తిరగడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశా రు. జీజీహెచ్ అధికారుల వినతి మేరకు ఆ స్పత్రి అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు చేస్తామన్నారు. వందరోజుల్లో తాను మళ్లీ వస్తానన్నారు. నెల రోజుల్లో జీజీహెచ్‌లో మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
60 శాతం మంది వైద్యులు
గైర్హాజరవుతున్నారు
నా వద్ద పూర్తి సమాచారం ఉంది
ఉమ్మడి జిల్లా సమీక్షలో
వైద్యారోగ్యశాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment