రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు.నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా అర్చ రీ ట్రైనింగ్ సెంటర్ రాజారం స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కొల్లూరులో డిసెంబర్ 25న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఖేలో ఇండియా అర్చరీ కోచ్ మద్దుల మురళి, పీటీ పీరియా ప్రతాప్ దాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment