ప్రమాదకరంగా కామారెడ్డి పెద్దచెరువు రోడ్డు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం నుంచి పెద్ద చెరువుకు వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. జీవదాన్ ఆస్పత్రి, జాతీయ రహదారి, నిజాంసాగర్ చౌరస్తా, లిటిల్ స్కాలర్స్ పాఠశాల, హౌసింగ్ బోర్డు నుంచి పెద్ద చెరువు వైపు వెళ్లే మార్గంలో వానాకాలంలో వరద నీటి ఉధృతికి మురికి కాలువ కూలి దానిని అనుకుని ఉన్న రోడ్డు సైతం కోతకు గురైంది. బతుకమ్మ, గంగమ్మ ఉత్సవాల సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికగా బారికేడ్‌ను అడ్డుగా పెట్టారు. ఇటీవల రాత్రి వేళ వాహనం బారికేడ్‌ను ఢీకొట్టడంతో అది గోతిలో పడిపోయింది. ప్రస్తుతం ఎలాంటి హెచ్చరిక లేకుండాపోయి ప్రమాదంగా మారింది. కొత్తవారు రాత్రి పూట వాహనంపై వస్తే అమాంతం దానిలో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మురికి కాలువ, గోడ నిర్మించాలని పెద్ద చెరువు కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment