ఆనందం.. అంతలోనే విషాదం
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్‌లోని నవోదయ విద్యాలయంలో మూడు రోజుల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆనందంగా పాల్గొని తిరుగు ప్రయాణమైన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. ఈ ఘటన రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. మహమ్మద్‌నగర్ మండలంలోని గాలీపూర్ మాజీ సర్పంచ్ ఆడుపల్లి విజయ శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటరమణారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా డు. అతడు పా ఠశాల విద్య నిజాంసాగర్‌నవోదయ విద్యాలయంలో అభ్యసించడంతో ఈనెల 22న పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయసమ్మేళనానికి హాజరై, అదేరో జు హైదరాబాద్‌కు వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి మరో పూర్వ విద్యార్థిని దోమకొండకు చెందిన శివానితో కలిసి బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో శివాని అక్కడికక్కడే మృతిచెందగా, వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. సా ఫ్ట్‌వేర్ ఉద్యోగంతో స్థిరపడ్డానని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తానని వెంకటరమణారెడ్డి స్నేహితులతో చెప్పినట్లు తెలిసింది. కా నీ అతడు మృతిచెందడంతో స్వగ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
22న నవోదయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పాల్గొని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
ఒకరు అక్కడికక్కడే మృతి
మరొకరు చికిత్స పొందుతూ మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment