‘ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం’
లింగంపేట: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాయంపల్లిలో పర్యటించి, గ్రామానికి చెందిన కుంట యశోద చేపల చెరువు యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యశోద రూ. 3.50 లక్షల రుణం పొంది, చేపల పెంపకం చేపట్టారని, దాణా తయారీ యంత్రం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. చేపలు పెరిగిన తర్వాత మార్కెట్ సౌకర్యం కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. ఐకేపీ సహకారంతో చేపల పెంపకం, చేపల దాణా తయారీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యునిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్యశాఖాధికారి శ్రీపతి, తహసీల్దార్ నరేందర్‌గౌడ్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
సర్వే పరిశీలన
ఎల్లారెడ్డి రూరల్ : మీ సాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్ మంగళవా రం పరిశీలించారు. సి బ్బందికి సూచనలు ఇ చ్చారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, రోజూ 30–40 ఇళ్ల వర కు సర్వే చేయాలని సూ చించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ మహేందర్, ఎంపీడీవో ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment