కంపు కొడుతోంది.. శుభ్రం చేయండి సారూ..!
దోమకొండ: మండల కేంద్రంలోని బీబీపేట రోడ్డులో మురికి కాలువల పూడిక తీయడం లేదు. దీంతో మురికి నీరు నిల్వ ఉండి కంపుకొడుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వ్యాపారస్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలను శుభ్రం చేయాలని, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలని వారు కోరుతున్నారు. ఈవిషయంలో పంచాయితీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మురికి నీటి మళ్లింపు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని సంగం గ్రామంలో ‘వీధు ల్లో మురికి నీటి ప్రవాహం’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం ప్రధాన రహదారి వెంట మురికి నీటి ప్రవాహాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment