టీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్
ఎల్లారెడ్డి రూరల్: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కాపర్తి సంగమేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రకటించా రు. మంగళవారం ఎల్లారెడ్డిలో రెవెన్యూ ఉ ద్యోగుల సమావేశం నిర్వహించారు. ఇందు లో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా అశోక్, కోశాధికారిగా చిన్నారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ లు, నాయబ్ తహసీల్దార్‌లు పాల్గొన్నారు.
మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి
లింగంపేట: గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా మ త్స్యశాఖ అధికారి శ్రీపతి సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సంఘంలో చేరిన సభ్యులు తమవంతు వా టాగా రూ. 2,100 చెల్లించాలని సూచించా రు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు స త్యనారాయణ, అధికారులు గంగాధర్, సురే ష్, శ్వేత, మత్స్యకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment