మహిళ దారుణ హత్య
క్రైం కార్నర్
మోపాల్: మోపాల్ మండల కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఏడు నెలల తర్వాత ఘటన వెలుగులోకి రావడం శనివారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ గ్రామానికి చెందిన జంగం గంగారాం, విజయ భార్యభర్తలు. వీరికి మనోహర్, స్రవంతి సంతానం. దంపతుల మధ్య రెండేళ్ల క్రితం గొడవలు కావడంతో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. అదే గ్రామంలో ఉన్న చెల్లెలు భాగ్యలక్ష్మి వద్ద విజయ ఉంటోంది. ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన విజయ తిరిగి రాకపోవడంతో భాగ్యలక్ష్మి, విజయ భర్త గంగారాంనకు తెలియజేసింది. కుటుంబానికి దూరంగా ఉంటుండటంతో వారు కూడా పట్టించుకోలేదు. అయితే ఈ నెల 16న విజయ కుమారుడు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లితో డబ్బుల విషయంలో రోడ్ బుచ్చన్నతో పలుమా ర్లు గొడవ జరిగిందని, ఆయనపై అనుమానముందని చెప్పాడు. అదేరోజు అనుమానితుల ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించా రు. విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒ ప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు.
చిట్టీ డబ్బులు అడగడంతో..
మోపాల్‌కు చెందిన బుచ్చన్న వద్ద విజయ రూ.లక్ష చిట్టీ వేసేంది. చిట్టీ గడువు ముగిసినా.. డబ్బులు చెల్లించడంలేదు. దీంతో ఆమె బుచ్చన్నను డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో బుచ్చన్న ఎలాగైనా విజయ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద పశువుల కాపరిగా ఉన్న కోటగిరి మండలం కొడిచర్లకు చెందిన నగేష్‌కు విషయాన్ని తెలియజేశాడు. నగేష్ విజయను నమ్మించి కల్లు తాగుదామని గ్రామ శివారున కల్వర్టు వద్దకు రప్పించాడు. కల్లు తాగిన తర్వాత ఆమె చీర కొంగుతో గొంతుకు ఉరి వేసి హత్యచేశాడు. అక్కడే పంట నీటి కాల్వలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. శనివా రం విజయ మృతదేహాన్ని పాతిపెట్టిన చోట పో లీసులు జేసీబీతో వెలికితీశారు. ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, సీఐ సురేశ్, ఎస్సై యాదగిరి గౌడ్ ఘట నా స్థలాన్ని పరిశీలించారు. ఏడు నెలలు గడవడంతో ఎముకలు, చీర మాత్రమే తవ్వకాల్లో బయట పడ్డాయి. చీర విజయదే అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
ఏడు నెలల తర్వాత వెలుగులోకి..
పోలీసుల అదుపులో నిందితులు
Comments
Please login to add a commentAdd a comment