నిజామాబాద్‌అర్బన్ : ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరె న్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆహార భద్రత(రేషన్ కార్డులు), రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆయా పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించామని పేర్కొన్నారు. వాటికి సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయన్నారు.
దరఖాస్తులకు అవకాశం..
ఇప్పటికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకోనివారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు సూచించారు. ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో అర్జీలను సమర్పించవచ్చన్నారు. వీలుపడని వారు ప్రజాపాలన సేవా కేంద్రాలలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు అందించవచ్చన్నారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డులు, ఇతర పథకాల కోసం తెల్ల కాగితాలపై వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి, అర్హులకు ప్రయోజనం చేకూరుస్తామన్నారు. ఇటీవల జరిపించిన సామాజిక, ఆర్థిక సర్వేలోనూ రేషన్ కార్డులు అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించామన్నారు. ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునే వారి నుంచి అర్జీలు స్వీకరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రులు, సీఎస్ సూచించారు. ఎలాంటి గందరగోళం, తప్పిదాలకు తావు లేకుండా గ్రామ సభలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు,
ఇతర పథకాల వర్తింపు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రులు పొంగులేటి, ఉత్తమ్
రైతు భరోసా పథకం అమలులో భాగంగా నియమించిన విచారణ బృందాలు వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని మంత్రులు సూచించారు. వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు సమ న్వయంతో పనిచేసి నివేదిక అందించాలన్నా రు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అమలవుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి కుటుంబానికి మంజూరు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment