అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కామారెడ్డి టౌన్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 26 మందికి మంజూరైన రూ. 1.60 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈనెల 26వ తేదీనుంచి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. పేద ప్రజలకు వైద్య సేవల కోసం డిజిటల్ హెల్త్ కార్డు అందజేసి, రూ.10 లక్షల వరకు నిమ్స్‌లో ఉచిత వైద్యం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే రుణమాఫీ చేసి చూపించామని, ఇక రైతు భరోసా త్వరలో అందించబోతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 26 తర్వాత ఇందిరమ్మ ఇళ్లు,
కొత్త రేషన్ కార్డులు జారీ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Comments
Please login to add a commentAdd a comment