ఇద్దరూ ఐఏఎస్ అధికారులే..
2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశి ష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య 2016 బ్యాచ్‌కే చెందిన వల్లూరు క్రాంతి కూడా ఐఏఎస్ అధికారి. ఆమె సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధు లు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ జ హీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలోని రెండు జిల్లాల్లో పనిచేస్తుండడం విశేషం. ఇద్ద రూ పాలనలో తమదైన ముద్ర వేశారు. కా మారెడ్డి జిల్లా పరిపాలనలో సంగ్వాన్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టి వాటిని అమలు చేస్తున్నారు. సెలవు రోజుల్లో ఇద్దరూ ఒక చో టుకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆ రోజు ఉల్లాసంగా గడుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment