పెచ్చులూడిన అంగన్‌వాడీ భవనం
నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామంలో శనివారం అంగన్‌వాడీ భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో కేంద్రంలో చిన్నారుల బరువును తూకం వేస్తున్నారు. చిన్నారులు ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే పెచ్చులు పడ్డాయి. పెచ్చులు పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలోనూ అంగన్‌వాడీ భవనం పెచ్చులూడి కిందపడ్డాయి. దీంతో చిన్నారులను కేంద్రానికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శంకర్‌నాయక్, మాజీసర్పంచ్ దేశబోయిన సాయిలు అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.
చిన్నారులకు తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment