సింగపూర్ పర్యటనలో పోచారం
బాన్సువాడ : ప్రభుత్వ సలహాదారు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ శనివారం తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అడిటోరియంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కా ర్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడు గడప రమేష్‌బాబు, కాంగ్రెస్ నాయకుడు రోహిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
లీలారామన్
మృతికి సంతాపం
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనానికి 1963 సంవత్సరంలో పునాదిరాయి వేయడంతో పాటు నిర్మాణ సమయంలో ఉమ్మడి నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దివంగత బీఎన్.రామన్ భార్య లీలా రామన్ (94) శుక్రవారం అమెరికాలో మృతి చెందారు. ఆమె మృతికి తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ సంతాపం తెలిపారు. 2019లో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో రామన్ దంపతులు పాల్గొని, రాశివనంలో వేప, మర్రి మొక్కలు నాటారని, కళాశాల అభివృద్ధికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కళాశాల అభివృద్ధికి రామన్ దంపతులు చేసిన కృషిని పలువురు విద్యాభిమానులు కొనియాడారు.
‘ఎరువులను అధిక ధరలకు
విక్రయిస్తే చర్యలు’
నిజాంసాగర్: ఎరువులను ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి తిరుమల ప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఆయన అచ్చంపేట, మల్లూర్ సహకార సంఘాలు, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా, ఎరువులకు ఇతర మందులను అంటగట్ట వద్దన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి అమర్‌ప్రసాద్, అచ్చంపేట సొసైటీ సీఈవో సంగమేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం వచ్చేనెల 28 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనారిటీ విద్యార్థులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని, ఇతర వర్గాల వారికి లక్కీ డ్రా ఆధారంగా సీట్లు కేటాయిస్తామని వివరించారు.
‘సమస్యలు పరిష్కరించాలి’
కామారెడ్డి అర్బన్ : జిల్లాలోని ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవోస్ జిల్లా నాయకులు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్‌ను కోరారు. శనివారం టీఎన్జీవోస్ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్‌ను కలిసి సమస్యలు వివరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చక్రధర్, కోశాధికారి ఎం.దేవరాజు, ప్రతినిధులు యు.సాయిలు, రాజ్యలక్ష్మి, అబ్దుల్‌ఖదీర్, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment