కరీంనగర్ కార్పొరేషన్: బీసీ మహిళ కాబట్టే డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణికి ఇన్చార్జి మేయర్‌గా బాధ్యతలు ఇవ్వకుండా కుట్ర పన్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్‌రాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. నగర మేయర్ సునీల్‌రావు నెల రోజుల పాటు అమెరికాకు వెళ్లారని, కాని ఇన్చార్జి మేయర్‌గా డిప్యూటీ మేయర్‌కు బాధ్యతలు అప్పగించకపోవడం బీసీలను అవమానించడమేనని అన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్ 15 రోజులు దాటి సెలవుపై వెళ్తే డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాల్సి ఉందన్నారు. కేవలం బీసీ అయినందునే బాధ్యతలు ఇవ్వలేదన్నారు. మేయర్ సీటులో ఇన్చార్జిగా కూడా బీసీలు కూర్చోవడాన్ని సహించలేకపోతున్నారని మండిపడ్డారు. గతంలోనూ స్వరూపారాణికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదని, బీసీలు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారన్నారు. నెల రోజుల పాటు మేయర్ అమెరికాలో ఉంటారని ఫ్లైట్ రిటర్న్ టికెట్‌తో రుజువైనందున, డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి మేయర్‌గా బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment