జీపీ కార్మికులకు శిక్షణ తరగతులు
కరీంనగర్రూరల్: మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై ఇస్తున్న శిక్షణను పంచాయతీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాములు అన్నారు. కరీంనగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని జీపీ కార్మికులకు నిర్వహించనున్న నాలుగు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. పంచాయతీల వారీగా ఎంపిక చేసిన కార్మికులు నీటి సహాయకులుగా విధులను నిర్వహించాలని పేర్కొన్నారు. నీటిని సక్రమంగా సరఫరా చేసే బాధ్యత సహాయకులపైనే ఉంటుందని తెలిపారు. బోర్వెల్, విద్యుత్ మోటార్, పైపులైన్ లీకేజీ మరమ్మతు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం అధికారులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈఈ టి.అంజన్రావు, డీఈ శ్రీనివాస్, ఏఈలు అనూష, వినయ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment