పిల్లలేం చూస్తున్నారో?
● సెల్‌ఫోన్ మైకంలో విద్యార్థులు, యువత ● తల్లిదండ్రులూ.. నిఘా తప్పనిసరి ● ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 71 సైబర్ క్రైం కేసులు
నేటి పిల్లలు, యువత సెల్‌ఫోన్ మైకంలో ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా తిండి, నిద్ర మానేసి, అందులోనే లీనమవుతున్నారు. ఫోన్, కంప్యూటర్ వాడేవారు ఇంటర్‌నెట్‌లోకి వెళ్లగానే ఏదో ఒక రూపంలో అశ్లీలం పలకరిస్తుంది. పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే ఆ తర్వాత అన్నీ అలాంటి దృశ్యాలే పదేపదే వస్తుంటాయి. విద్యార్థులు, ముఖ్యంగా యువత ఇలాంటి సైట్లు చూడటం మొదలుపెడితే అది అలవాటుగా మారి, చివరికి వ్యసనమవుతుంది. గంటల తరబడి సోషల్ మీడియాలో ఉంటున్న పలువురు అనర్థాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 71 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్, కంప్యూటర్‌లో ఏం చూస్తున్నారో నిఘా ఉంచాలి. అవసరం తీరగానే వాటిని తీసుకోవాలి. – 8లోu
Comments
Please login to add a commentAdd a comment