● అర్హులందరూ దరఖాస్తు చేసుకోండి ● డీఆర్వో, ఎలక్టోరల్ ర
కరీంనగర్ అర్బన్: అర్హులైన ఉపాధ్యాయులు, పట్టభద్రులందరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని డీఆర్వో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ వరకు ఆయా జిల్లాల్లోని 271 మండలాల్లో 2,60,044 మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల నుంచి ఆఫ్‌లైన్‌లో 210, ఆన్‌లైన్‌లో 58,657 మొత్తం 58,867 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించి 271 మండలాల్లో 18,913 మంది నుంచి ఓటరు నమోదు దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినవి 2,959 ఉన్నాయని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటు నమోదులో తలెత్తుతున్న ఇబ్బందులను డీఆర్వో దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పవన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, మడుపు మోహన్‌చారి(కాంగ్రెస్), సత్తినేని శ్రీనివాస్(బీఆర్‌ఎస్), సిరిసిల్ల అంజయ్య(బీఎస్పీ), నాంపల్లి శ్రీనివాస్(బీజేపీ), ఎం.వాసుదేవ రెడ్డి (సీపీఐ(ఎం), కల్యాణపు ఆగయ్య(టీడీపీ) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment