విద్యార్థులు శాసీ్త్రయంగా ఆలోచించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్/ సప్తగిరికాలనీ: విద్యార్థులు శాసీ్త్రయంగా ఆలోచించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పరీక్ష 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల, మండల, జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహిస్తున్నామని వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ప్రశ్నపత్రాలను వేదిక కార్యాలయంలో తీసుకోవాలని హెచ్‌ఎంలకు సూచించారు. 94903 00725, 63047 04413, 97032 95685 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఫిజిక్స్ టీచర్లకు వర్క్‌షాప్..
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 220 మంది ఫిజిక్స్ టీచర్లకు వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విజ్ఞాన శాస్త్రాన్ని పిల్లలకు ఆసక్తి కలిగేలా బోధించాలన్నారు. పరిసరాల మీద అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను వారికి వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ టీచర్లకు పలు సూచనలు చేశారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణనిస్తున్నట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. క్వాలిటీ కో–ఆర్డినేటర్ కర్ర అశోక్ రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి మారం స్వదేశీకుమార్, సైన్స్ ఆఫీసర్ చాడ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ షెడ్డును
వినియోగంలోకి తీసుకురావాలి
నగరంలోని చైతన్యపురి మార్కెట్ షెడ్డును వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం షెడ్డును పరిశీలించారు. ఎస్సారార్ కళాశాల నుంచి డీమార్ట్ వైపునకు వెళ్లే రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్న చిరువ్యాపారులను అందులోకి తరలించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్ పరశురాం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment