సీఎంఆర్‌ఎఫ్ స్కీంలో కోత విధించొద్దు
కొత్తపల్లి: సీఎంఆర్‌ఎఫ్ స్కీం పేదలకు వరంలాంటిదని, ఇందులో కోత విధించకుండా వైద్య ఖర్చులు మొత్తం చెల్లించాలని మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ కోరారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంటకు చెందిన 10 మందికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గురువారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, పంపిణీ చేశారు. ఈ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యానికి అయిన ఖర్చులో కొంత కాకుండా మొత్తాన్ని చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెక్కులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment