దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభం
విద్యానగర్: కరీంనగర్ మండలంలోని నగునూర్ శ్రీదుర్గాభవాని ఆలయంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బ్రాహ్మీ అలంకరణలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో దుర్గాదేవికి ప్రత్యేక హారతులు ఇచ్చి, పూజలు నిర్వహించారు. కలశస్థాపన, గోపూజ, చండీహోమం గ్రహారాధన, అమ్మవారి దీక్షాపరులు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహిళలు దుర్గామాతకు ఒడిబియ్యం పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్‌రూరల్: చెర్లభూత్కూర్‌లోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేదపండితులు శ్రీనివాసశర్మ, సత్యనారాయణశర్మల ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రాచమల్ల కిష్టయ్య, కూర నరేశ్‌రెడ్డి, దబ్బెట రమణారెడ్డి, బుర్ర తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment