సాగేనా.. ఆగేనా? | - | Sakshi
Sakshi News home page

సాగేనా.. ఆగేనా?

Published Wed, Oct 9 2024 1:14 AM | Last Updated on Wed, Oct 9 2024 1:14 AM

సాగేన

● సీఎంఏ పనులపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ● ఇప్పుడు,అప్పుడు అంటూ కాలయాపన ● పది నెలలుగా ప్రజల నరకయాతన

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

‘కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముందు పెండింగ్‌ పనులు మొదలవుతా యి. ఈ నెలలో తప్పకుండా సీఎంఏ పనులు ప్రా రంభిస్తాం.’ గత పది నెలలుగా నగరపాలక ఉన్న తాధికారులు పదేపదే చెబుతున్న మాటలివీ. గతేడాది నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం ఉన్న రోడ్లు తవ్వి, ఇండ్ల ఎదుట గుంతలు తీసి మధ్యలోనే నిలిపివేయడంతో, ఆయా ప్రాంత వా సులు నరకం చూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప, పనుల్లో కదలికరావడం లేదు. ఓ వైపు చేపట్టిన దాదాపు 61పనుల్లో చాలావరకు ప్రారంభదశలోనే ఉండడం, ఒకటి, రెండు మాత్రమే సగానికి చేరడం, మిగిలిన 60 పనులు అసలు మొదలు పెట్టకపోయినప్పటికీ రూ.76 కోట్లు బిల్లు రికార్డు చేశారనే ఫిర్యాదులు హాట్‌టాపిక్‌గా మారాయి.

రూ.132 కోట్లు.. 121 పనులు

స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో కవర్‌ కాని డివిజన్లలోని లింక్‌రోడ్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా సీఎంఏ నిధులు కేటాయించారు. రూ.132 కోట్లతో దాదా పు 121 పనులు చేపట్టగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 61 పనులు ప్రారంభించారు. కోతిరాంపూ ర్‌ నుంచి కట్టరాంపూర్‌, జ్యోతినగర్‌ మోర్‌సూపర్‌మార్కెట్‌ నుంచి మంకమ్మతోట మీదుగా కాశ్మీర్‌గడ్డ వరకు తదితర ప్రధాన అంతర్గత రోడ్లతో పాటు, డివిజన్‌ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. ఉన్న రోడ్లను తవ్వేశారు. ఇండ్ల ముందు డ్రైనేజీల కోసం పెద్ద గుంతలు తీశారు. ఇక నిర్మాణాలే తరువాయి అనుకున్న సమయంలో, గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఫలితాలు వెలువడడం, బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోనే కాంట్రాక్టర్‌ ఎక్కడి పనులు అక్కడే అకస్మాత్తుగా నిలిపివేశాడు.

ఇళ్లకు వెళ్లడమూ కష్టమే...

సీఎంఏ పనులు నిలిపివేయడంతో ఆయా ప్రాంత వాసులు పది నెలలుగా నరకం చూస్తున్నారు. డ్రైనే జీ నిర్మాణం కోసం ఇంటికి,రోడ్డుకు మధ్య కాలువలా తవ్వడంతో, ఇండ్లకు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. తాత్కాలికంగా తడకలు, కర్రలు ఏర్పా టు చేసుకున్నా ప్రమాదకర విన్యాసాలు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతు న్న వారికి ఇల్లు దాటడం కష్టంగా మారింది. కోతి రాంపూర్‌ నుంచి కట్టరాంపూర్‌ వరకు మెయిన్‌ రోడ్డు దాదాపు 40 శాతం పూర్తవగా, 60 శాతం మి గిలి ఉంది. ఈ రోడ్డులోనే గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం ఉంటుంది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ గుడిలో భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సారి అసంపూర్తిగా ఉన్న రోడ్డు వెంట వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. సర్కస్‌గ్రౌండ్‌ వెనుకాల ఉన్న రోడ్డును కూడా నిర్మాణ క్రమంలో తవ్వి వదిలేశారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, హోటళ్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు నిత్యం బిజీగా ఉంటుంది. పది నెలలుగా ఈ రోడ్డు ప్రమాదకరంగా మారింది. జ్యోతినగర్‌నుంచి మంకమ్మతోట మెయిన్‌ రోడ్డులోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. అలకాపురికాలనీలోని పార్క్‌లేన్‌లో, ఆరెపల్లి బృందావన్‌కాలనీలో ఉన్న ఇండ్ల ముందు డ్రైనేజీ కోసం కాలువలా తవ్వడంతో, ఇండ్ల నుంచి వృద్ధులు బయటకు రావడం గగనంగా మారింది.

రూ.76 కోట్ల వ్యవహారంపై ఫిర్యాదు

రూ.132 కోట్ల సీఎంఏ నిధులతో సగం పనులే మొదలు పెట్టడం, అందులో ఒక్క పనికూడా పూర్తి కాకపోయినప్పటికి రూ.76 కోట్లు బిల్లు రికార్డు చేశారనే ప్రచారం తీవ్ర సంచలనం సృష్టించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఏజెన్సీకే ఈ సీఎంఏ కాంట్రాక్ట్‌ దక్కింది. చేయని పనులకు రూ.76 కోట్ల బిల్లు రికార్డు చేసి పంపించారని, దీనిపై విచారణ చేసి అధికారులు,కాంట్రాక్టర్‌పై చర్యతీసుకోవాలని నగర డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి సీడీఎంఏ, కలెక్టర్‌ తదితర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా సీఎంఏ నిధులతో చేపట్టి, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ఏజెన్సీ ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని స్థానిక కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సాగేనా.. ఆగేనా?1
1/2

సాగేనా.. ఆగేనా?

సాగేనా.. ఆగేనా?2
2/2

సాగేనా.. ఆగేనా?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement