కలెక్టర్ కార్యాలయంలో...
కరీంనగర్ అర్బన్: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్ప తి స్వయంగా బతుకమ్మను పేర్చారు. మహిళా అధికారులు, ఉద్యోగులతో ఆడి పాడారు.
విద్యుత్ భవన్‌లో
టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. వేడుకలను ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్ ప్రారంభించారు. డీఈలు విజయేందర్‌రెడ్డి, రాజం, తిరుపతి, లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, గోపికృష్ణ, అధికారులు లావణ్య, స్వప్న, తులసి, నిర్మలరాణి, సంపూర్ణ, నవ్య, సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూ చిత్తుల బొమ్మ
పలు గ్రామాల్లో ఘనంగా ఏడొద్దుల సద్దుల బతుకమ్మ
కరీంనగర్ రూరల్/కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం కరీంనగర్ మండలం బొమ్మకల్, గుంటూరుపల్లె, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్(బావుపేట), ఖాజీపూర్ గ్రామాల్లో వైభవంగా జరి గాయి. సద్దుల వేడుకలను ఈ గ్రామాల్లో ఏడు రోజులకు జరుపుకోవడం ఆనవాయితీ. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద ఆడబిడ్డలు ఆడిపాడి మురిసిపోయారు. మళ్లీ రావ మ్మా అంటూ చెరువులో నిమజ్జనం చేశారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకు న్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపల్లి మండలంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలతమహేశ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, బొమ్మకల్‌లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీని వాస్– లలిత, మండల అధ్యక్షుడు రాంరెడ్డి, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment