అన్యాయాన్ని వివరించేందుకే పాదయాత్ర
కరీంనగర్: ఎస్సీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు చేపట్టి పాదయాత్ర ఆదివారం జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలమాదిగలను విభజించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండానే సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మాలమాదిగలలో ఎవరు ఎక్కువ పొందారో లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాలమహానాడు జాతీయ కార్యదర్శి బైరి రమేశ్, రాష్ట్రకార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే సుధాకర్‌ను అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతర ఆయన వెంట దుర్శెడ్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment