కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సర్కిల్ పరిధి లోని విద్యుత్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఎటూ తేలకుండానే వాయిదా పడింది. సీఎండీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం బదిలీ ఉత్తర్వులు ఇ వ్వాల్సి ఉండగా మంగళవారం సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సీఎండీ నిర్ణయించారు. ఇది మింగుడుపడని ఉద్యోగులు, నాయకులు పైరవీ లకు తెరలేపినట్లు సమాచారం. ప్రొటెక్షన్ విషయంలో యూనియన్ల ప్రతి నిధులు అధికారులపై ఒత్తిడి తెస్తుండడం సామాన్య ఉద్యోగుల బదిలీలపై ప్రభా వం చూపుతోంది. విద్యుత్ సంస్థలోని కొంత మంది ఇంజినీర్లు కరీంనగర్‌ను వదలడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడే తిరుగుతూ, తిరిగి తిష్ట వేయాలని మంత్రులు, పలుకుబడి ఉన్న వ్యక్తులతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్న ట్లు తెలిసింది. దీంతో మిగిలిన ఇంజినీర్లు, ఉద్యోగుల్లో నైరాశ్యం నెలకొంది. పైరవీల ఒత్తిడి పెరుగుతు ండటంతో బదిలీలను తాత్కాలికంగా నిలిపివేశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతానికి భి న్నంగా మూడేళ్లకు బదులు రెండేళ్లకే బదిలీల ప్ర క్రియ చేపడుతూ సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అనేక మంది బదిలీ కావల్సి వస్తోంది. సీఎండీ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు సామాన్య ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపుతుండగా నాయకులకు మా త్రం మింగుడు పడటం లేదు. బదిలీలు జరుగుతా యా..నిలిచిపోయాయా.. సమాచారం లేక చా లా మంది ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment