కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌ని గురువారం సాయంత్రం 4 గంటలకు నగరపాలిక కార్యాలయంలో తిసభ్య కమిటీ విచారించనుంది. కమిషనర్ తనను అవమానించారంటూ మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లను ఆశ్రయించిన నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు జిల్లా అధికారులతో కమిటీ వేశారు. గత సెప్టెంబర్ 5వ తేదీన టీపీఎస్, మాజీ కార్పొరేటర్ మధ్య మొదలైన వివాదం కమిషనర్ వద్దకు చేరింది. ఆ సమయంలో ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే అభియోగంపై చంద్రశేఖర్‌ను అదేరోజు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. అయితే, ప్రజా సమస్యలపై కమిషనర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, తనను గెట్ అవుట్ అంటూ అవమానించారని ఆయన రాష్ట్ర, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ట్రెజరీ అధికారి, డీపీఆర్‌వోలతో కూడిన త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియమించారు. మెండి చంద్రశేఖర్ ఫిర్యాదుపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుకు కమిటీ తరఫున సమాచారం అందించారు. ఇదిలా ఉంటే మేయర్ యాదగిరి సునీల్‌రావుపై 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత ఇచ్చిన ఫిర్యాదుపైనా ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment