జమ్మికుంట: ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు అపహరించిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. జమ్మికుంట పట్టణానికి చెందిన సూదం చంద్రకళ గతనెల 28న స్థానిక కొండూర్కాంప్లెక్స్లో ఉన్న శివాలయానికి వెళ్లి వస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మాటల్లో దింపి, బంగారు గొలుసును అపహరించుకెళ్లాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సిద్దిపేటకు చెందిన అల్లెపు కృష్ణ నిందితుడిగా గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బంగారం రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment